Aathmika: కోలీవుడ్‌లో నెపోటిజం రచ్చ.. శంకర్ కుమార్తెపై హీరోయిన్ ట్వీట్..

Aathmika: నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎంత పెద్ద రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లోనే నెపోటిజం అనేమాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇతర భాషా పరిశ్రమల్లో కూడా ఇది ఉన్నా.. ఎవ్వరూ ధైర్యంగా మాట్లాడే సాహసం చేయలేదు. అలాంటి కోలీవుడ్‌లో ఈ అంశం గురించి మాట్లాడడానికి ఓ హీరోయిన్ ముందుకొచ్చింది.
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.. కోలీవుడ్ సినిమాను మార్చేసిన కొందరు దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించి కోలీవుడ్ మార్కెట్‌ను పెంచడానికి సహాయపడ్డారు. అలాంటి శంకర్.. ఇప్పుడు తన కూతురు అదితిని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఇప్పటికే కార్తీతో డెబ్యూ మూవీ పూర్తి చేసుకున్న అదితి శంకర్.. అప్పుడే తన రెండో సినిమాను శివకార్తికేయన్‌తో ప్రారంభించింది.
దీనిపై కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఆత్మిక ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యింది. 'సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది. మరి మిగతావాళ్లు..' అంటూ ట్వీట్ చేసింది ఆత్మిక. ఈ ట్వీట్ డైరెక్ట్‌గా అదితి శంకర్‌నే టార్గెట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
It's good to see privileged getting easy way through the ladder while the rest 🥲
— Aathmika (@im_aathmika) August 4, 2022
Paathukalam 🙌🏽
ఇక 'మీసాయా మురుకు' చిత్రంతో హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయమయ్యింది ఆత్మిక. ఆ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయినా కూడా తనకు మరో అవకాశం రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఇప్పటికీ ఆత్మిక అవకాశాలు కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇలాంటి సమయంలోనే నెపోటిజం ట్యాగ్ పెట్టుకొని అదితి శంకర్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేయడం తనకు నచ్చక ఇలా మాట్లాడిందంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com