Ravindra Mahajani: మరో దిగ్గజ నటుడి కన్నుమూత

Ravindra Mahajani: మరో దిగ్గజ నటుడి కన్నుమూత
ప్రముఖ మరాఠి నటుడు, దర్శకుడు రవీంద్ర మహాజనీ మృతి... మరాఠి రాజ్‌కపూర్‌గా గుర్తింపు.... అమితాబ్‌తోనూ కలిసి నటించిన దిగ్గజ నటుడు...

మరాఠి సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాతున్నాయి. ప్రముఖ నటి, పద్మ శ్రీ సులోచన లక్తర్‌, నటుడు ప్రదీప్‌ పట్వర్ధన్‌ మరణాలను మరచిపోకముందే మరో దిగ్గజ నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, మరాఠీ దర్శకుడు 77 ఏళ్ల రవీంద్ర మహాజనీ(Ravindra Mahajani) ఆకస్మికంగా కన్నుమూశారు. పూణే‍(PUNE)లోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అతని ఫ్లాట్‌లో రవీంద్ర మరణించినట్లు మరాఠి సినీ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల క్రితమే( died 3 days ago) ఈ దిగ్గజ నటుడు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. రవీంద్ర మహాజని కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లోనే ఒంటరిగా ఉంటున్నారని వెల్లడించారు.


శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే రవీంద్ర మహాజని(Marathi actor) పార్థీవదేహం కనిపించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. రవీంద్ర మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.


రవీంద్ర మహాజని మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా(vinod khanna) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం రెండూ వినోద్ ఖన్నాను పోలి ఉంటాయి. రవీంద్ర పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ నటించిన సాత్ హిందుస్తానీ చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. ఇదే అతని మొదటి సినిమా. ఆ తర్వాత మరాఠీలో ఆరం హరమా ఆహే, దునియా కరీ సలామ్, హల్దీ కుంకు చిత్రాలకు పనిచేశాడు. ముంబయి చా ఫౌజ్దార్, కలత్ నకలత్‌తో పాటు ఆయన నటించిన 'లక్ష్మీ చి పావ్లే' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


రవీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని‍(gashmir mahajani) హిందీ సీరియల్ ఇమ్లీలో నటించారు. కుమారుడితో కలిసి తెరపై తొలి మరాఠీ చిత్రం క్యారీ ఆన్ మరాఠాలో అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా గష్మీర్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు 2019లో వచ్చిన అర్జున్ కపూర్, కృతి సనన్ చిత్రం 'పానిపట్'లో కూడా కలిసి పనిచేశారు.

Tags

Next Story