Actor Upendra: చిక్కుల్లో పడ్డ కన్నడ నటుడు ఉపేంద్ర

కన్నడ నటుడు, పొలిటిషీయన్ ఉపేంద్ర పై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయింది. ప్రజాకీయా పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర ఫేస్‌బుక్, ఇన్‌స్టా లైవ్ నిర్వహించారు. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన కొన్ని సామెతలు చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, తీవ్ర ఆవేదనకు గురి చేశాయంటూ కొందరు బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నాటకలో ఉపేంద్ర వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసనలు చేపట్టారు.
అయితే తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్ వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. ఫేస్‌బుక్,ఇన్‌స్టా లైవ్‌లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశానని,తన వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బందిపడ్డారని, అందుకు తనను క్షమించండి అంటూ ఉపేంద్ర పోస్ట్ పెట్టారు.
Tags
- upendra
- actor upendra
- case against actor upendra
- kannada actor upendra
- fir against actor upendra
- upendra movies
- upendra controversy
- upendra interview
- upendra movie
- upendra songs
- real star upendra
- fir against upendra
- actor chetan controversy
- upendra controvery
- upendra prajakeeya
- upendra facebook live video controversy
- upendra interviewe
- upendra rana
- upendra latest news
- upendra reaction on controversy
- upendra recent controversy
- priyanka upendra
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com