Actor Vikram: విక్రమ్‌కు కోర్టు నోటీసులు.. తప్పుగా చూపించారంటూ..

Actor Vikram: తమిళంలో ఉన్న డెడికేటెడ్ నటులలో విక్రమ్ ఒకరు. తను ఏ పాత్ర చేసినా.. అందులో నేచురల్‌గా కనిపించడానికి ఎంత కష్టపడడానికి అయినా వెనకాడడు విక్రమ్. ఇటీవల కాస్త అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన విక్రమ్.. వెంటనే కోలుకొని మళ్లీ సినిమా పనులతో బిజీ అయ్యాడు. తాజాగా విక్రమ్‌తో పాటు మణిరత్నంకు కూడా కోర్టు నోటీసులు పంపడం కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది.
ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో సీనియర్ డైరెక్టర్‌గా ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేశారు మణిరత్నం. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియిన్ సెల్వన్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నాడు. ఇటీవల విడుదలయిన టీజర్ కూడా విజువల్ వండర్‌గా అందరినీ ఆకట్టుకుంది. ఇంతలోనే మూవీ టీమ్‌కు ఓ షాక్ తగిలింది.
పొన్నియిన్ సెల్వన్‌లో ఆదిత్య కరికాలన్‌గా కనిపించనున్నాడు విక్రమ్. అయితే మూవీ పోస్టర్‌లో విక్రమ్ నుదుటిపై తిలకం ఉందని, టీజర్‌లో లేదని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని అన్నారు. చారిత్రక వాస్తవాలను చూపించడంలో మేకర్స్ విఫలమయ్యారని అన్నారు. సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఆ లాయర్ పిటీషన్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com