Rashmika mandanna : మరో జన్మలో అబ్బాయిగా పుట్టాలనుంది.. రష్మిక కామెంట్స్ వైరల్..
Rashmika mandanna : టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు.. ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ...

Rashmika mandanna : టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు.. ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ... అనతి కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక తాజాగా ఆమె నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రం మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ రష్మిక అంతలా ఏం మాట్లాడింది అంటే.. మరో జన్మంటూ ఉంటే అబ్బాయిలాగా పుట్టాలి అనుకుంటున్నానని తెలిపింది." నెక్ట్స్ లైఫ్‌లో అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నా. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నా. ఈ సినిమాల కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా విసిగిపోయాను" అని చెప్పుకొచ్చింది రష్మిక..
ఇక సినిమా విషయానికి వస్తే.. శర్వానంద్ సరసన రష్మిక మొదటిసారి నటించింది. తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.