అక్కడ హీరోలు సెట్స్ కు లేట్ గా వస్తారు

అక్కడ హీరోలు సెట్స్ కు లేట్ గా వస్తారు
బాలీవుడ్ లో బద్ధక రత్నపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అదా శర్మ
ది కేరళ స్టోరీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అదా శర్మ ప్రస్తుతం గాల్లో తేలిపోతోందనే చెప్పాలి. సినిమాపై ఎన్ని వివాదాలు చెలరేగినా రెండువందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఇదే ఊపులో అదా ఎడా పెడా సినిమాలు చేసేస్తుంది అనుకుంటే పొరపాటే. మంచి కథలకే నా ఓటు అంటూ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అనేక ఇంటర్వ్యూలు ఇస్తోన్న అదా శర్మ, ఇన్నేళ్ల ప్రయాణంలో తాను ఎదుర్కొన్న సమస్యలను సైతం వివరిస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఏకరువు పెట్టింది. చాలా సార్లు హీరోలు సెట్స్ కు లేట్ గా వస్తుంటారని, వారు వచ్చేవరకూ షూటింగ్ మొదలవ్వదని వాపోయింది. షూటింగ్ సాంతం ప్రశాంతంగా సాగాలంటే అది డైరెక్టర్ యాటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో నటించిన అదాశర్మ ఇకపై మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటానంటూ సెలవిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story