Adipurush : రాసిస్తా.. మిమ్మల్ని నిరాశపరచను : ఓం రౌత్

Adipurush : ఆదిపురుష్ టీజర్‌పై వస్తున్న ట్రోల్స్ గురించి దర్శకుడు ఓం రౌత్ మరో సారి స్పందించారు. ఆదపురుష్ టీజర్ కార్టూన్‌లా, వీడియో గేమ్‌లా ఉందని ఇప్పటికే అనేక ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ లుక్ కూడా అల్‌ఖైదా ఉగ్రవాదిలా ఉందంటూ విమర్శలు వచ్చాయి. వీటిపై ఓంరౌత్ స్పందిస్తూ.. 'ఆదిపురుష్ సినిమా మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు. ఈ విషయాన్ని నేను కావాలంటే మీకు నోట్ రాసి ఇస్తా'.. అని దర్శకుడు ఓం రౌత్ రాసుకొచ్చారు.
ఆదిపురుష్‌ను బిగ్రస్క్రీన్ పైన చూసి రివ్యూ ఇవ్వాలన్నారు. టీజర్లో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశామన్నారు. జనవరి 12వరకు ఆగి అప్పుడు ఎలాంటి రివ్యూ ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు దర్శకుడు ఓం రౌత్. ఆదిపురుష్‌లోని రాఘవ పాత్రను ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకొనే రాశానన్నారు. ప్రభాస్ ఒప్పుకోకపోతే ఆదిపురుష్ తెరకెక్కించేవాడినే కాదని అన్నారు డైరెక్టర్. ఆయన నటన అద్భుతంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com