Aishwarya Rajinikanth :రెండో పెళ్ళా.. ఛాన్సే లేదు

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి పుకార్లకు తెర పడింది. ఆమెకు అసలు ద్వితీయ వివాహం మీద ఆలోచనే లేదని తేల్చి చెబుతున్నారు ఆమె సన్నిహితులు. ప్రస్తుతం ఆమె లాల్ సలామ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రజనీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హీరో ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా కొనసాగుతున్నారు ఐశ్వర్య. ఓవైపు పిల్లల్ని చూసుకుంటూనే, మరోవైపు ఓ సినిమా డైరెక్టర్ గా బిజీ గా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అసలు ఐశ్వర్యపై ఇలాంటి పుకార్లు రావడానికి ఓ కారణం ఉంది. ఈమధ్య కోలీవుడ్ కు చెందిన ఓ హీరోతో రిసార్ట్ లో ఆమె కనిపించడమే ఇందుకు కారణం.
తనకంటే చిన్నవాడైన ధనుష్ ను ప్రేమించి పెళ్లాడింది ఐశ్వర్య. స్టార్ కపుల్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా 18 సంవత్సరాల పాటు వీరి బంధం సాగింది. ఒక సమయంలో ధనుష్ పై సుచిలీక్స్ ఆరోపణలు, ధనుష్ తండ్రి ఎవరనే లీగర్ అంశం ఎదురైనప్పుడు కూడా ఐశ్వర్య భర్తకు అండగా నిలిచింది. తరువాత సడన్గా తామిద్దరం విడిపోతున్నట్టు ధనుష్-ఐశ్వర్య ఇద్దరూ ప్రకటించటంతో అంతా అవాక్కయ్యారు.
తరువాత వీరిపై మరో పుకారు కూడా వచ్చింది. అధికారికంగా విడిపోయిన వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తున్నారని, స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగి కూతురు-అల్లుడు మధ్య సయోధ్య కుదిర్చారని కథనాలు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆ తర్వాత తేలింది. ఇప్పడు తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లి అంశం తెరపైకొచ్చింది. అయితే అసలు అందుకు అవకాశమే లేదని సన్నిహితులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com