Kollywood: అజిత్‌ ఓ మోసగాడు: నిర్మాత

Kollywood: అజిత్‌ ఓ మోసగాడు: నిర్మాత
తమిళ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌ అజిత్‌పై తీవ్ర ఆరోపణలు.. అజిత్‌ ఓ మోసగాడన్న నిర్మాత మాణిక్కం నారాయణన్‌... డబ్బుుల తీసుకొని మోసం చేశారని తీవ్ర ఆరోపణలు

వివాదాలకు దూరంగా, నిరాడంబరంగా, సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయే తమిళ సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకడైన తలా అజిత్‌పై ఓ నిర్మాత చేసిన ఆరోపణలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. అజిత్ అందరూ అనుకున్నంత జెంటిల్‌మ్యాన్ కాదని, తనని మోసం చేశాడని నిర్మాత మాణిక్కం నారాయణన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా చేస్తానని డబ్బు తీసుకుని మోసం చేశాడని వెల్లడించారు. సినిమా చేయకపోగా, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు.


తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. అజిత్ తన తల్లిదండ్రులను సెలవులకు మలేషియాకు పంపాలని తన నుంచి డబ్బు 16 ఏళ్ల క్రితం రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడని ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా తన కోసం సినిమా చేస్తానని చెప్పాడని... ఇప్పటికీ సినిమా చేయలేదని, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని నారాయణన్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు అసలుతో కలిపి ఆ మొత్తం రూ.1 కోటికి చేరుకుందని, అజిత్ జెంటిల్ మ్యాన్ కాదు, తనను మోసం చేశాడని విమర్శించారు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడని. అతను తనను తాను పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదని చెప్పుకొచ్చాడు. హీరో అజిత్‌కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు.


అజిత్ భార్య షాలినితో తనకు చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉందని, ఆమె చాలా మంచిదని నిర్మాత మాణిక్కం తెలిపారు. అజిత్‌ది చాలా మంచి కుటుంబమన్న మాణిక్కం, ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనే ఆయన ఇలా మోసం చేయడం ఎందుకని ప్రశ్నించారు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని. ఆయనతో సినిమాలు తీసి రోడ్డున పడ్డవారికి అజిత్ ఏనాడు సాయం చేయలేదని చెప్పారు. మాణిక్కం నారాయణన్ కమల్ హాసన్ తో కలిసి ‘వేట్టైయడు విలయడు’, ‘ఇంద్రలోహతిల్ నా అళగప్పన్’ లాంటి చిత్రాలను నిర్మించారు.

ఈ విషయంపై అజిత్ మేనేజర్ స్పందించారు. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఇలాంటి విషయాల గురించి తాము స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. నిర్మాత వ్యాఖ్యలపై అజిత్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మాణిక్కం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్‌ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story