Allu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?

Allu Arjun: సినీ పరిశ్రమలో కొందరు నటీనటుల కార్ల కలెక్షన్స్ చూస్తుంటే దిమ్మదిరిగిపోయేలా ఉంటుంది. ఇక స్టార్ హీరోల కార్లు అయితే కళ్లు చెదిరేలా ఉంటాయి. కొందరు నటీనటులకు తమ కార్ల కలెక్షన్ పెంచుకోవడం చాలా ఇష్టం. అలాంటి హీరోల్లో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే తాజాగా అల్లు అర్జున్ కార్ల కలెక్షన్స్‌లోకి ఓ కొత్త కారు వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ గ్యారేజ్‌లో ఇప్పటికే ఎన్నో అడ్వాన్స్ మోడల్ కార్లు ఉన్నాయి. పైగా వాటన్నింటి విలువ కోట్లలోనే ఉంటుంది. ఇక ఇటీవల బన్నీ.. తాజ్ కృష్టాలోని ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌కు బన్నీ ఇంతకు ముందు అభిమానులు చూడని ఓ కొత్త కారులో వచ్చాడు. దీంతో ఇటీవల తను ఆ కారును కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అదే రోల్స్ రాయిస్ కల్లినాన్ ఎస్‌యూవీ.
అల్లు అర్జున్ వచ్చిన రోల్స్ రాయిస్ కల్లినాన్ ఎస్‌యూవీ పూర్తిగా వైట్ కలర్‌లో ఉంది. ఎన్నో లగ్జరీ కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్.. ఇటీవల ఈ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌లాంటి హీరో దగ్గర ఈ కారు ఉండగా.. ఇప్పుడు బన్నీ కూడా దీనిని కొనుగోలు చేశాడు. అయితే ఈ కారుకు పెయింటింగ్‌కు మాత్రమే రూ.1 కోటి ఖర్చు అవుతుందట. అంతే కాకుండా మొత్తంగా ఈ కారు ధర రూ.6.95 కోట్లు అని నిపుణులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com