Amazon: ప్రియాంక చోప్రా వెబ్ షోతో అమెజాన్‌కి 2వేల కోట్ల నష్టం
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్‌లు, షోలకు అయ్యే బడ్జెట్ ఖర్చులపై సమగ్ర విశ్లేషణ చేయాలని సీఈవో(CEO) ఆండీ జాస్సీ ఆదేశించాడు. వేలాది కోట్లు పెట్టి వెబ్ సిరీస్‌లు, షోలు తీస్తున్నా ప్రేక్షకులు ఆదరించకపోవడంతో అమెజాన్‌కి అవి నష్టాల్లే మిగులిస్తున్నాయి. ఇందులో ఈ సంవత్సరం బాలీవుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా తీసిన సిటాడెల్ సిరీస్ కూడా ఉంది.పలు దేశాల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే వెబ్‌సిరీస్‌లు, షోలను నీల్సన్ అనే వెబ్‌సైట్ ప్రచురిస్తోంది. ఇందులో సిటాడెల్ వంటి షోలు టాప్-10 లో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అమెజాన్ భారీ మొత్తంలో 2000 కోట్ల వ్యయంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో 'సిటాడెల్'ని నిర్మించారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. అమెజాన్‌తో నిక్ జోనాస్, ప్రియాంకచోప్రాలతో భాగస్వామ్యం ప్రభావం చూపలేకపోయింది. సిటాడెల్ సిరీస్‌లో మొత్తం 8 ఎసిసోడ్లు తీయగా, అందులో 6 మాత్రమే ప్రసారమయ్యాయి. ఒక్కో ఎపిసోడ్‌కి 20 మిలియన్ డాలర్ల ఖర్చు అయింది. ఇవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయాయి. రెండవ సీజన్‌కి జో రస్సోని దర్శకుడిగా నియమించారు. దీనికి అతడికి 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది.
అయితే మన దేశంలో సిటాడెల్‌కి ఇండియన్ వర్షన్‌ని నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, వరుణ్ ధావన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ హిట్టైన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్, డీకే దర్శకత్వంలో రాబోతుంది. ప్రియాంక చోప్రా గ్లోబల్ వర్షన్‌ని ఆదరించని భారత ప్రేక్షకులు దీనిని ఎలా స్వాగతిస్తారో చూడాలి.
సిటాడెల్‌తో పాటుగా 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తీసిన 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' పై అమెజాన్ చాలా ఆశలు పెట్టుకుంది. అది కూడా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఉత్తమ సిరీస్‌లకు ర్యాంకింగ్‌లు ఇచ్చే నీల్సన్ టాప్-10 లిస్ట్‌లో సిటాడెల్ లేకపోవడంతో కంపెనీ సీఈవో సీరియస్ తీసుకున్నాడు. పోటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే షోలు వీటి కంటే ముందున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత విభాగాల పనితీరును విశ్లేషించి, నివేదిక ద్వారా చర్యలు తీసుకోవాలని సీఈవో ఆండీ జాస్సీ ఆదేశించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com