AR Rahman: తృటిలో తప్పిన పెను ప్రమాదం

AR Rahman: తృటిలో తప్పిన పెను ప్రమాదం
పాట చిత్రీకరణలో భాగంగా కింద పడిన షాండ్లియర్; స్వరమాంత్రికుడి తనయుడికి తప్పిన పెను ప్రమాదం..
స్వర మాంత్రికుడు, అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తనయుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పాట చిత్రీకరణలో భాగంగా భారీ షాండ్లియర్ కింద అకస్మాత్తుగా కింద పడింది. ఆ సమయంలో రెహ్మాన్ తనయుడు అమీన్ షాండ్లియర్ పడిన ప్రాంతంలోనే ఉన్నారు. క్రేన్ సహాయంతో షాండ్లియర్ ను తరలిస్తుండగా అది కాస్తా అదుపుతప్పి కింద పడింది. అయితే అమీన్ వెంటనే తేరుకుని పక్కకు తప్పుకోవడం పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఈమేరకు ట్వీట్ చేసిన అమీన్ ఆ దేవుడి దయవల్లా, తన తల్లిదండ్రుల దయవల్లా తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. షాండ్లియర్ పడిన చోటుకి కేవలం కొన్ని ఇంచుల దూరంలోనే తాను ఉన్నానని తెలిపాడు. కాస్త అటూఇటూ అయినా సదరు షాండ్లియర్ తమ బృందంపై పడి ఉండేదని తెలిపాడు. ఈ ఘటనలో అమీన్ కు దెబ్బలేమీ తలకపోయినప్పటికీ ఇదంతా తనని మానసిక ఆందోళనకు గురిచేసిందని వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story