Ariana Grande :భర్త నుంచి విడిపోనున్న అమెరికన్ గాయని?

Ariana Grande :భర్త నుంచి విడిపోనున్న అమెరికన్ గాయని?
గత జనవరి నుంచి విడివిడిగా ఉంటున్న జంట

వివాహము విడాకులు ఇప్పుడు పర్యాయపదాలుగా మారిపోయాయి. అలా అని కష్టపడి కలిసుండమని కూడా ఎవరూ చెప్పే పరిస్థితి కనిపించటం లేదు. సినిమాలు, నిజ జీవితం, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎందులోనైనా ఇదే పరిస్థితి. తాజాగా అమెరికన్ సింగర్, రైటర్ అరియానా గ్రాండే తన భర్త నుంచి విడాకుల దిశగా సాగుతోంది. రెండు సంవత్సరాల క్రితం ఈమె ఒక బిజినెస్ మాన్, ఎస్టేట్ బ్రోకర్ డాల్టన్ గోమెజ్ను వివాహం చేసుకుంది. అయితే వీళ్ళిద్దరూ ఈ ఏడాది జనవరి నుంచే విడివిడిగా ఉంటున్నారని మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు లండన్ లోని ఒక వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్కు హాజరైన అరియన తన వెడ్డింగ్ రింగ్, వెడ్డింగ్ బ్యాండ్ ధరించలేదన్న విషయాన్ని ప్రకటించింది. గత ఏప్రిల్ లో ఓ కాన్సర్ట్ లో అరియన తన ఉంగరంతో కనిపించింది. ఆ తరువాత ఆమె ఉంగరాన్ని ధరించ లేదని ఆమె ఫాన్స్ చెబుతున్నారు.




అరియానా డిసెంబర్‌లో 'వికెడ్' చిత్రంలో నటించటం ప్రారంభించింది. తరువాత జనవరి నుండి భర్తకు దూరంగానే ఉంటోంది. అయితే డాల్టన్ ఆమెను చూడటానికి, మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ అరియన అందుకు సుముఖంగా లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అరియానా తన 15 వ ఏట 2008 బ్రాడ్‌వే మ్యూజికల్- 13 లో తన సింగింగ్ కెరియర్ ప్రారంభించింది. 2010-2013లో నికెలోడియన్ టెలివిజన్ సిరీస్ 'విక్టోరియస్', సామ్‌, 'క్యాట్ వాలెంటైన్' తర్వాత ఆమె చాలా ఫేమస్ అయ్యింది. ప్రపంచంలో అందమైన మహిళలలో ఈమె 5 వ స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story