Kishor Das: సినీ పరిశ్రమలో విషాదం.. 30 ఏళ్ల నటుడు మృతి..

Kishor Das: ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎన్నో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సహజంగానో లేక ఆత్మహత్య చేసుకొనో ఎంతోమంది యంగ్ నటీనటులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో యంగ్ నటుడు మృతి చెందాడు. పైగా మృతిచెందిన సమయంలో అతడికి కోవిడ్ ఉండడంతో ఆసుప్రతి సిబ్బంది తన అంతిమ సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అస్సాంలోని కామ్‌రూప్‌కు చెందిన కిషోర్ దాస్.. క్యాన్సర్ బారినపడ్డాడు. గత ఏడాదిగా తను క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నాడు. ఎన్నో ప్రైవేట్ సాంగ్స్‌లో కనిపించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పును పొందిన కిషోర్.. క్యాన్సర్‌తో పోరాడలేక ప్రాణాలు విడిచాడు. పైగా మరణించిన సమయంలో కిషోర్.. కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రి సిబ్బందే తన అంతిమ సంస్కారాలు చేపట్టారు.
ఎక్కువశాతం కిషోర్ దాస్.. అస్సాం పరిశ్రమలోనే పనిచేశాడు. పలు బుల్లితెర షోలతో కూడా తను అలరించాడు. 'టురుట్ టురుట్' అనే పాట.. కిషోర్ దాస్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'దాది హమీ తుమో దుస్తో బర్' అనే అస్సాం చిత్రంలో చివరిసారిగా మెరిశాడు కిషోర్. సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయిన కిషోర్.. 2019లో అవార్డ్ కూడా అందుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com