Avatar 3: అవతార్ 3 కి ఛార్లీ చాప్లిన్ కి ఏంటి సంబంధం...!?

X
By - Chitralekha |3 Feb 2023 3:40 PM IST
అవతార్ 3 గురించి కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత; చార్లీ చాప్లిన్ లింక్ ఉందంటూ....
అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే ఊపులో అవతార్ 3ని కూడా అదే స్థాయిలో నిర్మించబోతున్నట్లు చిత్ర నిర్మాత లాన్ లాండు తెలిపారు. ఇటీవలే ఓ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అవతార్ 3లో ఓ సరికొత్త నవీ జాతిని ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. వారే ఈ సినిమాలో అసలైన విలన్లు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ జాతికి నాయకురాలిగా ప్రముఖ కమెడియన్ ఛార్లీ చాప్లిన్ మనులమరాలు ఊనా చాప్లిన్ కీలక పాత్ర పోషించబోతోందట.అవతార్ 4 లో అతిపెద్ద టైమ్ జంప్ ఉండబోతోందని తెలిపారు. దాని ద్వారా అవతార్ 5 కథ రూపొందుతుందని తెలిపారు. 5వ భాగంలో కథను భూమి మీదకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com