Pallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై అనుమానాలు..

Pallavi Dey: హత్యలు, ఆత్మహత్యలు అనేవి గత కొంతకాలంగా సినీ పరిశ్రమను కుదిపేస్తు్న్నాయి. వెండితెర అయినా, బుల్లితెర అయినా.. ఆర్టిస్టులు హఠాత్తులగా చనిపోవడం అందరినీ కలవరపెడుతోంది. అది కూడా యంగ్, టాలెంటెడ్ నటీనటులకే ఇలా జరగడం ఏంటని ప్రేక్షకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి అనుమానాస్పద మృతి మరోసారి సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
పలు బెంగాలీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది పల్లబి దే. కోలకత్తాలోని ఓ ఫ్లాట్‌లో తను నివాసముంటుంది. తనతో పాటు తన స్నేహితుడు షాగ్నిక్ చక్రవర్తి కూడా అదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే ఇటీవల షాగ్ని్క్ బయటికి వెళ్లి తిరగొచ్చేలోపు పల్లబి దే ఉరేసుకొని కనిపించింది. దీంతో పోలీసులకు ఈ సమాచారాన్ని అందించాడు.
షాగ్నిక్, పల్లబి దే కేవలం నెలరోజుల నుండే కలిసుంటున్నారని సమాచారం. అయితే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఉన్నట్టుండి తన కూతురు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతుందని.. ఇది కచ్చితంగా హత్యే అని పల్లబి దే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో షాగ్నిక్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com