Bollywood: స్టార్ కిడ్ తో బెల్లీ బ్యూటీ ప్రేమాయణం... నిజమేనా!

ఇటీవలే డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో సారి వార్తల్లో నిలిచాడు. అనన్యా పాండేతో డేటింగ్‌లో ఉన్నాడనే వర్తలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా మరో హీరోయిన్‌తో అబ్బాయి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకు ఎవరా మగువ అంటే నోరా ఫతేహి అని తెలుస్తోంది.
ఇందుకు సాక్ష్యం వారు దిగిన ఫోటోనే అంటున్నారు నెటిజన్లు. నోరా ఫతేహి, ఆర్యన్ ఓకే అమ్మాయితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
దీంతో అనన్యా అభిమానులు తెగ బెంగపడిపోతున్నారు. అనన్యాను వదులు కోవద్దు అంటూ ఆర్యన్‌ఖాన్‌ను వేడుకుంటున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణమని తెలిసిందే.
ఇక అనన్యాపై కూడా ఇంతకు ముందు ఇంలాంటి పుకార్లు చాలనే వచ్చాయి. విజయ్ దేవరకొండ, ఆదిత్యారాయ్ కపూర్, ఈషాన్ ఖత్తార్ లతో ఈ అమ్మడు ప్రేమాయణం కొనసాగించిందనే రూమర్స్ కూడా చాలానే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com