Bollywood: సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆస్కార్ గ్రహీత
తన 56వ పుట్టినరోజు సందర్భంగా... డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించిన AR రెహమాన్

తన సంగీతంతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఏఆర్ రెహమాన్, మరో కొత్త ప్రయోగంతో ఉవ్విళ్లూరిస్తున్నారు. తన 56వ పుట్టినరోజు సందర్భంగా డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్ కత్రార్‌ను ప్రారంభించారు. సంగీత కళాకారుల కోసం కొత్త మార్గాన్ని రూపుదిద్దేదిశగా 'కత్రార్'కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
తన 56వ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ను ప్రారంభించినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా సంగీతంలోని వివిధ కళారూపాలను పొందుపర్చవచ్చని, తద్వారా అందులో నుంచి త్వరగా డబ్బు సంపాదించుకోవచ్చని తెలిపారు. అంటే సంగీత ఆర్టిస్టులు, మ్యూజిషియన్లు నేరుగా వారి క్రియేషన్స్ ను 'కత్రార్' లో అప్‌లోడ్ చేయవచ్చనితెలియజేశారు.
కత్రార్ మెటావర్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎంతో ఉత్సహంగా ఉన్నట్లు తెలిపిన రెహమాన్... తన లక్ష్యాన్ని అందుకునేందుకు ఇంకా అడుగు దూరంలో మాత్రమే ఉన్ననంటూ వెల్లడించాడు. కత్రార్ కు సంబంధించిన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ రెహమాన్ తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
ఇక త్వరలో అనేక అంతర్జాతీయ క్రియేషన్స్ ఈ వేదికపైకి రానున్నాయని, ప్లాట్‌ఫారమ్ HBAR ఫౌండేషన్ భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులోకి వస్తుందని చెపుకొచ్చారు. ప్రస్తుతం రెహమాన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.