Bollywood: యంగ్ టైగర్ కోసం... కళ్లు బైర్లుకమ్మే రేటు...

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది జాన్వీకపూర్. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తన నటనతో తల్లికి తగ్గ తనయురాలిగా పేరు సంపాదించాలని ఓ రేంజ్ లో శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ అమ్మడు దక్షిణాది సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట.
తాజాగా జాన్వి యంగ్ టైగర్ జు. ఎన్టీఆర్ 30వ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపిందని సమాచారం. అయితే ఈ చిత్రం కోసం భారీగా పారితోషకం డిమాండ్ చేస్తోందట అమ్మడు. తెలగునాట అడుగుపెట్టాలంటే... రూ.5 కోట్లు సమర్పించుకోవాల్సిందేనని పట్టుబడుతోందట.
గతేడాది ఆలియా భట్ 'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగు తెరకు పరిచయమవ్వగా, మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ సైతం 'సీతారామం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయా చిత్రాల్లో నటించిన వీరు తమ నటనతో ప్రశంసలు అందుకున్నారు. వీరి బాటలోనే నడిచేందుకు జాన్వీ కూడా ట్రై చేస్తోంది. కాకపోతే వారు హిట్ అందుకున్న తర్వాత రెమ్యూనరేషన్ పెంచేస్తే, జాన్వీ మాత్రం ముందే భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తోందని వినికిడి.
మరీ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది అంటే ఆ మాత్రం ఉండాలి అని కొందరు, హిట్ రాకముందే భారీగా వసూలు చేస్తోందే అని మరికొందరు ముక్కు మీద వేలువేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com