Brahmastra : రూ.100కే బ్రహ్మాస్త్ర మూవీ టికెట్.. ఎప్పటినుంచంటే..
Brahmastra : సెప్టెంబర్ 23న సినిమా డేరోజు కొన్ని మల్టీప్లెక్స్‌లు రూ.112కే టికెట్లను విక్రయించాయి. దీంతో ఆరోజు ఆడియన్స్ అధిక సంఖ్యలో మల్టీప్లెక్స్‌లకు తరలివచ్చారు. టెకెట్ ధర అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమా చూడడానికి వస్తారని బ్రహ్మాస్త్ర టీం అభిప్రాయపడింది. మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది బ్రహ్మాస్త్ర టీం. సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 29 వరకు థియేటర్లలో రూ.100+ జీఎస్టీ రేటుకే సినిమా టికెట్లను ప్రకటించింది.
అలియాభట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు సుమారు 400ల కోట్లను కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే ఆఫర్ ప్రకటించిన బ్రహ్మాస్త్ర టీం.. ఎందులో రూ.100కి టికెట్ ఉంటుందో క్లారిటీ ఇవ్వలేదు. మల్టీప్లెక్స్‌లోనా లేక సింగిల్ స్క్రీన్ పైనా చూడాల్సిందే.
Celebrate Navratri with #Brahmastra!
— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022
Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September.
Book your tickets now!
BMS - https://t.co/qjPVPFdZfT
Paytm - https://t.co/eVmK21uC8n
T&C Apply* pic.twitter.com/vz7Du38dUG
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com