Chandrababu : సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా : చంద్రబాబు

Chandrababu : సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా : చంద్రబాబు
X
Chandrababu : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఫో సీజన్ 2 అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది

Chandrababu : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఫో సీజన్ 2 అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో మొదటి గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత అసక్తికరంగా చంద్రబాబు ఇంటర్వ్యూ ఉండనుంది. ఆహా ఓటీటీలో ఇప్పిటికే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ భారీ సక్సస్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా బాలయ్య, చంద్రబాబు మధ్య జరిగిన షోలో ఆసక్తికరమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను సంధించారు బాలకృష్ణ. "95లో నేను తీసుకున్న ఆనిర్ణయం తప్పా..?" అని చంద్రబాబు బాలకృష్ణను అడగడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చజరుగుతోంది. "కాళ్లు పట్టుకొని వేడుకున్న.. అయినా వినలేదు" అని చంద్రబాబు భావోద్వేగంగా చెప్పారు. 95లో జరిగిన దాని గురించి అసలు బాబు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే అక్టోబర్ 14వరకు ఆగాల్సిందే.

చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. బాలయ్య అన్‌స్టాపబుల్ 2 షో మదటి ఎపిసోడ్.. భావోద్వేగంతో పాటు.. రొమాంటిక్‌గా ఫన్నీగా సాగింది. మీకంటే మేము ఎక్కువగానే రొమాన్స్ చేశాము అని చంద్రబాబు బాలకృష్ణతో అంటారు. వైఎస్ నేను మంచి స్నేహితులమ్ అని కూడా చెప్పారు. తన సతీమణిని ముద్దుగా ఏమి పిలుస్తారో కూడా చెప్పారు మాజీ సీఎం. మొత్తం ఎపిసోడ్‌లో అసలు ఏమి జరిగిందో తెలియాలంటే అక్టోబర్ 14వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Next Story