Chandramukhi 2: త్వరలోనే 'చంద్రముఖి' సీక్వెల్.. హీరోగా రాఘవ లారెన్స్..
Chandramukhi 2: చంద్రముఖి అనే సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సినిమాలంటే కొందరు దర్శకులు మాత్రమే తెరకెక్కించగలరు అనుకుంటున్న సమయంలో చంద్రముఖి చిత్రంతో హారర్ సినిమాల్లో ఓ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు దర్శకుడు పి వాసు. 2005లో విడుదలయిన ఈ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. కోలీవుడ్‌లోనే అది పెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
చంద్రముఖి మూవీ కలెక్షన్ల విషయంలో ఓ సంచలనాన్నే సృష్టించింది. అంతే కాకుండా తెలుగులో తమిళ డబ్బింగ్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది. హిందీతో సహా చాలా భాషల్లో ఈ మూవీ రీమేక్ అయ్యింది. 'భూల్ భులయ్య' పేరుతో ఈ మూవీ హిందీలో రీమేక్ కాగా తాజాగా దీనికి సీక్వెల్‌గా 'భూల్ భులయ్య 2' కూడా వచ్చి మంచి హిట్ అందుకుంది.
17 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు పి వాసు. అయితే ఈ సీక్వెల్ ఐడియా వాసు దగ్గర ఎప్పటినుండో ఉంది. అయితే ఇందులో హీరోగా రజినీకాంత్ నటించగా.. రాఘవ లారెన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ సీక్వెల్‌లో రజినీ లేరు. రాఘవ లారెన్స్, వడివేలు లీడ్ రోల్‌లో చంద్రముఖి 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక హారర్ సినిమాలతో వరుసగా హిట్లు కొడుతున్న రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండడంతో.. చంద్రముఖి సీక్వెల్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨
— Lyca Productions (@LycaProductions) June 14, 2022
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com