Kevin Spacey: పురుషులపై నటుడు లైంగిక వేధింపులు.. ఛార్జ్ షీట్ దాఖలు..
Kevin Spacey: 2005లో మొదటిసారిగా కెవిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. 2008, 2013లో కూడా ఆరోపణలు వచ్చాయి.

Kevin Spacey: సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుంటాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అది నిజమో కాదో చెప్పే ఆధారాలు మాత్రం పెద్దగా లేవు. కానీ మీ టూ ఉద్యమం ద్వారా సినీ పరిశ్రమలో మహిళలను వేధింపులకు గురిచేసిన ఎంతోమంది పెద్దవారి పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా ఓ స్టార్ హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వడం సంచలనాన్నే సృష్టించింది.
హాలివుడ్ స్టార్ యాక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత కెవిన్ స్పేసీ యాక్టింగ్ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఇప్పటికీ ఆయన పలుమార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. అది కూడా మహిళలపై వేధింపులకు పాల్పడినందుకు కాదు.. పురుషులపై పాల్పడినందుకు. అవును.. ఇప్పటికి ముగ్గురు పురుషులు కెవిన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
2005లో మొదటిసారిగా కెవిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. ఆ తర్వాత 2008, 2013లో కూడా తనపై ఆ ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగికదాడికి పాల్పడినట్టు కెవిన్ ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. తాజాగా అది నిజమే అని నిరూపణ కావడంతో బ్రిటన్ పోలీసులు తనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మరింత విచారణ తర్వాత కెవిన్‌కు ఈ కేసులో శిక్షపడనుంది.