Chiranjeevi : ఆ విషయంలో నేనేమీ చేయలేను : చిరంజీవి

Chiranjeevi : ఆ విషయంలో నేనేమీ చేయలేను : చిరంజీవి
Chiranjeevi : గాడ్ ఫాదర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు

Chiranjeevi : గాడ్ ఫాదర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ సినిమాలోని డైలాగ్స్ 'నేను రాజకీయం నుంచి తప్పుకున్నాను గానీ రాజకీయం నా నుంచి తప్పుకోలేదు' అనే డైలాగ్ ఎవర్నీ ఉద్దేశించింది కాదని చెప్పారు. మళయాలంలో వచ్చిన లూసిఫర్ చిత్రాన్ని రీమేక్ చేసిన క్రమంలో ఈ డైలాగ్స్ రాశారని అన్నారు. దీనికి ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని అన్నారు.

సోదరుడు పవన్‌కళ్యాణ్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి నాయకత్వం అందించే సామర్ధ్యం పవన్‌కు ఉంది. ప్రజలు ఆ అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మెగాస్టార్. 'కొత్త తరహా సినిమాలు చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు చరణ్ నా దగ్గరకు వచ్చి.. లూసిఫర్ మూవీ చూశావా నాన్నా అని అడిగాడు. మీకు నచ్చితే ఈ సినిమా మీతో చేయాలనుకుంటున్నా అని అన్నాడు. నాకు సినిమా నచ్చింది. మోహన్ రాజా ఓ కీలక మార్పు చేసి అద్భుతంగా తెరకెక్కించారు. మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు చిరంజీవి.

Tags

Read MoreRead Less
Next Story