Cinema: కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో "ఐ" మనోహరి

బ్రిటన్‌లో పుట్టిపెరిగిన బ్యూటీ అమీజాక్సన్ తమిళ సినిమా మదరాసపట్టిణంతో ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత విక్రమ్‌తో ఐ సినిమాలో నటించి తెలుగు వారికి చాలా దెగ్గరైంది, రోబో-2లో రజనికాంత్ సరసన మెరిసింది. అయితే ఈ అమ్మడు సినిమాలకంటే సోషల్‌మీడియాలో పెట్టె పోస్ట్‌లతోనే చాలా ఫేమస్ అయిందటే ఆశ్చర్యమేంలేదనే చెప్పవచ్చు. లండన్‌లో ఉంటున్న ఈ సుందరి బ్రిటన్ వ్యాపారవేత్త జార్జ్ పనాయోటైతో ప్రేమాయణం నడిపి హెడ్‌లైన్స్‌కెక్కింది. అతనితో మనువాడకుండానే బిడ్డను కూడా కనేసింది. ఇంతటితో ఆగని అమ్మడు బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్లకే జార్జ్‌తో విడిపోయింది. ఈ నేపథ్యంలోనే అమీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ మొదలుపెట్టేసింది. నటుడు ఎడ్‌వెస్టిక్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోంది. వీరి ప్రేమపై పుకార్లు షికార్లు కొట్టినప్పటికీ అమీజాక్సన్ మాత్రం ఎప్పుడు స్పందించలేదు. కాగా వాలంటైన్స్ డే సందర్భంగా అమీ తన కొత్త ప్రేమికుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ అంటూ హీటెక్కించే రొమాంటిక్ ఫోటొలను షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com