Cinema: బాబా వల్లే నా కెరీర్ నాశనమైపోయింది

Cinema: బాబా వల్లే నా కెరీర్ నాశనమైపోయింది
మనీషా కొయిరాలా కీలక వ్యాఖ్యలు

మనీషా కొయిరాలా 90ల్లో ఈ అందాల తార పేరు తలచుకుని ఊహల్లో తేలిపోయే కుర్రకారుకు కొదవే లేదు. కెరీర్ పీక్స్ లో ఉండగానే అనుకోని కారణాలతో డీలా పడ్డ మనీషా ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ కు అకస్మాత్తుగా బ్రేకులు పడటానికి దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ బాబా అని చెప్పి షాక్ ఇచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. బాబా సినిమాలో నటించే నాటికి మనీషా ఖాతాలో భారతీయుడు, ఒకేఒక్కడు వంటి భారీ హిట్స్ ఉన్నాయి. ఇదే కోవలో అత్యంత భారీ అంచనాలతో బాబా తెరకెక్కింది. స్వయంగా రజినీకాంత్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటూ, నిర్మాతగానూ వ్యవహరించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అందరూ భావించారు.కానీ, అనూహ్యంగా సినిమా అత్యంత భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో పాటే హీరోయిన్ గా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని మనీషా చెబుతోంది. బాబా తరువాత తనకు ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయని అలా సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందని మనీషా వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story