Cinema: పొన్నియన్ సెల్వన్ 2... నెక్స్ట్ లెవెల్ అంతే...

Cinema: పొన్నియన్ సెల్వన్ 2... నెక్స్ట్ లెవెల్ అంతే...
X
విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్

ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ అంగరంగ వైభవంగా జరిగింది. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆద్యంతం రమణీయంగా సాగింది. మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళ సామ్రాజ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించిన మ‌ణిర‌త్నం... భారీ తారాగణంతో ఈ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది. మరి పొన్నియన్ సెల్వన్ 2 మొదటి భాగాన్ని మించి ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో చూాడలి.

Tags

Next Story