Harnaaz Kaur Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్‌పై కోర్టులో కేసు..

Harnaaz Kaur Sandhu: మిస్ యూనివర్స్ అనే కిరీటం అందాల పోటీలు అన్నింటిలో చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ పోటీలు ప్రారంభమయిన తర్వాత కేవలం ఇద్దరు మాత్రం ఈ కిరీటాన్ని ఇండియాకు తీసుకురాగలిగారు. వారే 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా. ఇక తాజాగా పంబాబీ బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు.. మిస్ యూనివర్స్‌గా నిలిచి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. కానీ ఇంతలోనే ఓ కోర్టు కేసులో చిక్కుకుంది హర్నాజ్.
మిస్ యూనివర్స్‌గా నిలవక ముందే మోడల్‌గా ఉన్నప్పుడే పలు చిత్రాల్లో నటించింది హర్నాజ్. అవి కూడా పంజాబీ చిత్రాల్లో. అందులో ఒకటైన 'భాయ్ జీ కుట్టంగే' అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. ఇదంతా హర్నాజ్ మిస్ యూనివర్స్ అవ్వక ముందే జరిగింది. కానీ మిస్ యూనివర్స్ కిరీటం గెలిచిన తర్వాత హర్నాజ్ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి తనకు సమయం కుదరలేదు.
మూవీ ప్రమోషన్స్‌కు కూడా వస్తానని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత హర్నాజ్ ఇప్పుడు స్పందించడం లేదని భాయ్ జీ కుట్టంగే మూవీ నిర్మాత ఉపాసన సింగ్ కోర్టును ఆశ్రయించారు. హర్నాజ్‌కు 'యారా దియా పో బారన్' అనే మరో చిత్రంలో కూడా అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చింది ఉపాసన. అందుకే హర్నాజ్ చేసిన దానికి పరిహారం కావాలంటూ ఛండీఘడ్ కోర్టులో సివిల్ సిట్ దాఖలు చేసింది నిర్మాత. ఈ విషయంలో హర్నాజ్ ఇప్పటివరకు ఏమీ స్పందించకపోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com