Crime : నటి ఆత్మహత్య.. సింగర్ పై కేసు..

Crime : నటి ఆత్మహత్య..  సింగర్ పై కేసు..
నటి తల్లి మధు దుబే ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది

భోజ్ పురి గాయకుడు సమర్ సింగ్, అతని సోదరుడిపై హత్య కేసు నమోదైంది. భోజ్ పురి నటి ఆకాంక్ష దుబేను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తు పోలీసులు కేసు నమోదు చేశారు. 25ఏళ్ల ఆకాంక్ష దుబే ఆదివారం వారణాసిలోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకుంది. ఓ సాంగ్ షూటింగ్ కోసం వారణాసికి వెళ్లిన దుబే ఓ హోటల్ లో బస చేసింది. షూటింగ్ అనంతరం హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నటి తల్లి మధు దుబే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్... ఆకాంక్ష దుబేను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలిపారు సారనాథ్ పోలీస్ స్టేషన్ SHO ధర్మపాల్ సింగ్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సారనాథ్) జ్ఞాన్ ప్రకాశ్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యగా అనుమానిస్తున్నామని, ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన దూబే "కసమ్ పైడా కర్నే వాలే కి 2", "ముజ్సే షాదీ కరోగి" (భోజ్‌పురి) , "వీరోన్ కే వీర్" వంటి అనేక ప్రాంతీయ చిత్రాలలో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story