Danush: జన్మనిచ్చిన రుణం... తీర్చుకునే ప్రయత్నం...

Danush: జన్మనిచ్చిన రుణం... తీర్చుకునే ప్రయత్నం...
తల్లిదండ్రులకు అతి పెద్ద బహుమతి ఇచ్చిన హీరో ధనుష్...

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ సర్ సినిమా సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడనే చెప్పాలి. ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా రూ. 20కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. అయితే తాజా ముచ్చట ఏంటంటే, ధునుష్ తన తల్లిదండ్రులకు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. ఎంత చేసినా కన్న రుణం తీర్చుకోలేనని భావించిన ధనుష్ తన తల్లిదండ్రులకు చెన్నైలో రాజమందిరాన్ని తలపించే గృహాన్ని బహూకరించాడట. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో విశాలమైన భవంతిని తన తల్లిదండ్రులైన కస్తూరిరాజా, విజయలక్ష్మిలకు బహుమతిగా ఇచ్చేశాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇల్లు కూడా ఇక్కడే ఉండటం విశేషం. మరోవైపు తన భార్య ఐశ్వర్యా రజినీకాంత్ తో విడాకులు తీసుకున్న ధనుష్, పిల్లల కోసం తిరిగి ఒక్కటయ్యారన్న వార్తలు టిన్సెల్ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story