Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం..

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం..
Vijay: చెన్నైలోని పనైయూర్‌లో విజయ్‌కు సంబంధించిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఉంది.

Vijay: కోలీవుడ్‌లో ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్. ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే విజయ్.. రాజకీయాల్లోకి రావడం గురించి కోలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. దాని గురించి సరిగా క్లారిటీ లేకపోయినా.. విజయ్‌కు మాత్రం చెన్నై శివార్లలో ఓ పార్టీ ఆఫీస్ ఉంది. ఇటీవల ఆ పార్టీ ఆఫీసులో ఓ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది.

చెన్నైలోని పనైయూర్‌లో విజయ్‌కు సంబంధించిన 'విజయ్ మక్కల్ ఇయక్కం' పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఉంది. ఈ పార్టీకి, తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. తన ఫ్యాన్స్ దీనిని నడిపిస్తున్నారు కాబట్టి పరోక్షంగా వెనకుండి నడిపిస్తున్నాడు విజయ్. అయితే తాజాగా ఈ పార్టీ ఆఫీసును ఆధునికీకరించాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఆఫీసు పెయింటింగ్ పనుల కోసం ప్రభాకరన్ అనే వ్యక్తి పెయింట్ కాంట్రాక్టర్‌గా పనిలో పెట్టారు.

ఇటీవల తన సొంతూరుకు వెళ్లి వచ్చిన ప్రభాకరన్.. గురువారం రాత్రి ఆఫీసుకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో తను పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసు సూపర్‌వైజర్‌ను పరోటా తినడానికి డబ్బులు అడిగినట్టు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి ప్రభాకరన్ ఆఫీసులో శవమై పడున్నాడు. అంతే కాకుండా తన చేతిలో, నోటిలో పరోటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆకలితో ఉన్న ప్రభాకరన్.. వేగంగా పరోటాను తినడంతో ఊపిరి ఆగిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story