Deadpool 3: డెడ్ పూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

Deadpool 3: డెడ్ పూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
డెడ్ పూల్ 3 (Deadpool 3)లో కొత్త అవతారంలో హ్యూ జాక్‌మన్ (Hugh Jackman)

హాలీవుడ్ లో సాధారణంగా యాక్షన్ మూవీస్ ఎక్కువని మనకి తెలుసు. కానీ డెడ్ పూల్ (Deadpool)అందుకు కాస్త మినహాయింపు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు,లవ్,కామెడీ కూడా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు డెడ్ పూల్ సినిమా హీరో ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds) తన సహా నటుడు హ్యూ జాక్‌మన్తో(Hugh Jackman) కలిసి ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. 2009 వుల్వరైన్ తరువాత ఇద్దరూ కలిసి తెరమీద కనిపించే చిత్రమిది ఫన్నీ గా ఉన్న ఈ ఫొటోలో రాయన్ తన రెగ్యులర్ డెడ్ పూల్ ఔట్ఫిట్ తో ఉండగా జాక్మెన్ మాత్రం వుల్వరైన్ (Wolverine) లుక్ లో కనపడుతున్నాడు.

డెడ్ పూల్ 3(Deadpool 3) లో రోడ్ ట్రిప్ గా అభివర్ణించారు. అలాగే ఈ చిత్రం నుంచి లీకైన మరిన్ని చిత్రాలు జనాలకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్ సీక్వల్ కోసం ర్యాన్, హ్యూగ్ చిత్రీకరిస్తున్న ఫోటోలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. ఈ సినిమాలో జెన్నీఫర్ గార్నర్(Jennifer Garner)కూడా కనువిందు చేయనుంది. చాలా కాలం తరువాత ఈమె మార్వెల్ (Marvel)ప్రపంచం లోకి అడుగుపెట్టనుంది. షాన్ లేవి దర్శకత్వం వహించానున్న ఈ సినిమా ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్తో కలిసి చేస్తున్న 2 వ సినిమా. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ది ఆడమ్ ప్రాజెక్ట్ (The Adam Project)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

2016లో, డెడ్ పూల్ ప్రపంచవ్యాప్తంగా $782 మిలియన్ల గ్రాస్ తో గ్రాస్తో బాక్సాఫీస్ బడ్డాలుగొట్టింది. 2018లో దీని సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా $785 మిలియన్లను వసూలు చేసి, అంతకు ముందు వచ్చిన భారీ మొత్తాన్ని కూడా అధిగమించింది.

ఇక హ్యూ జాక్మన్ వుల్వరైన్(Wolverine) విషయానికొస్తే, అతను 2000లో నుంచి తెరపై X-మెన్(X- Man) పాత్రను పోషిస్తున్నాడు. X2 (2003), X-మెన్: ది లాస్ట్ స్టాండ్(X- Man : The Last Stand) (2006), X-మెన్ ఆరిజిన్స్ తో సహా పలు పాత్రాలలో నటించాడు.

Tags

Read MoreRead Less
Next Story