Dhanush Aishwarya: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట.. కేసుపై స్టే..
Dhanush Aishwarya: 18 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనాన్ని సృష్టించింది. అసలు వారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు మళ్లీ బిజీ అయిపోయారు. తాజాగా వీరిద్దరికి హైకోర్టులో ఓ కేసు విషయంలో ఊరట లభించింది.
మామూలుగా సినిమాల్లో ధూమపానం, మద్యపానం గురించి సన్నివేశాలు వచ్చినప్పుడు.. అవి ఆరోగ్యానికి హానికరం అని ఓ వార్నింగ్ ఇవ్వడం తప్పనిసరి. అయితే ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' అలియాస్ రఘువరన్ బీటెక్ సినిమాలోని ఓ స్మోకింగ్ సీన్‌లో ఈ వార్నింగ్ ఇవ్వలేదు. దీంతో తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జూలైలో సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు కారణంగా ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్.. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రకారం వారిద్దరు జులై 15న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ కేసు కొట్టివేయడంపై, కోర్టులో హాజరుపై ధనుష్, ఐశ్వర్య విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు వీరి పిటిషన్లకు సానుకూలంగా స్పందించింది. ఇక కేసు కొట్టివేయడం గురించి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com