Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన హీరో..
Dhanush: కాస్త పాపులారిటీ వచ్చిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అంతే కాకుండా ఫలానా నటి లేదా నటుడు.. తమ వారసులే అంటూ ఎంతోమంది ముందుకొస్తుంటారు. అవన్నీ నిజాలు కాకపోయినా.. అందరి ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి నటీనటులకు వస్తుంది. తాజాగా ధనుష్‌కు కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది.
మధురైలో ఉండే కథిరేసన్, మీనాక్షి అనే దంపతులు.. ధనుష్ తమ కొడుకే అంటూ మీడియా ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుండి ధనుష్‌కు సినిమాలంటే ఇష్టమని, అందుకే ఇంట్లో నుండి పారిపోయాడని వారు అన్నారు. ఈ కేసు ఎంతోకాలంగా కోలీవుడ్‌లో సాగుతూనే ఉంది. అయితే దీని వల్ల విసిగిపోయిన ధనుష్.. తన తండ్రి కస్తూరి రాజాతో కలిసి కథిరేసన్‌కు లీగల్ నోటీసులు పంపాడు.
'ఇకపై వారిపై అబద్ధపు ఆరోపణలు చేయవద్దని నా క్లైంట్స్ కోరుతున్నారు.' అని నోటీసులో పేర్కొన్నారు ధనుష్ తరపున లాయర్. అంతే కాకుండా ఇకపై ఇలాంటివి ఆపకపోతే వారు కోర్టులో పరువునష్టం దావా కూడా వేస్తామని నోటిసులో తెలిపారు. అంతే కాకుండా రూ.10 కోట్ల జరిమానాకు కూడా వారు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇదిలా మరోవైపు ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com