Thiru : ధనుష్ 'తిరు' ఓటీటీ డేట్ వచ్చేసింది..

Thiru : ధనుష్ 'తిరు' మూవీ థియేటర్లలో ఆగస్టు 18న విడుదలై సందడి చేసింది. మేకర్స్ నెలన్నరలోనే ఓటీటీలో డేట్స్ ఇచ్చేశారు. నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీకన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న సన్‌నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది. తమిళనాడులో ఈ సినిమా భారీ కలెక్షన్లను సంపాదించింది.
కథ విషయాని వస్తే.. హీరో చిన్నప్పుడు హుషారుగానే పెరిగినా మధ్యలో కాలేజ్ మానేస్తాడు. ఫుడ్ డెలీవరీ బాయ్‌గా పనిచేస్తుంది. తండ్రి తాతయ్యతో కలిసి జీవిస్తుంటాడు. తన ఫ్లాట్ కింద పోర్షన్‌లో శోభన అనే అమ్మాయితో ఎప్పిటి నుంచో పరిచయం ఉంటుంది. అయితే అనూష్, రంజని ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తాడని శోభన తెలుసుకుంటుంది. శోభన తిరు ప్రేమకు ఎలా సాయం చేస్తుంది. చివరికి తిరు ఎవరిని ప్రేమిస్తాడనేది మెయిన్ మూవీ కాన్సెప్ట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com