Madhavan: సినిమా కోసం ఇంటిని అమ్మేసిన మాధవన్..! క్లారిటీ ఇచ్చిన హీరో
Madhavan: ఒక బయోపిక్ తెరకెక్కించాలంటే మామూలు సినిమాకంటే కాస్త ఎక్కువే కష్టపడాలి. ఎవరి జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కించాలి అనుకుంటున్నారో.. వారి జీవితాన్నే పూర్తిగా స్టడీ చేయాలి. చాలామందికి వారి గురించి తెలియని కథను తెలియజేయాలి. అలా ఇటీవల వచ్చిన బయోపిక్స్‌లో బెస్ట్‌గా నిలిచింది 'రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్'. అయితే ఈ సినిమా కోసం మాధవన్ ఇల్లు అమ్మేశాడంటూ వస్తున్న వార్తలపై ఇటీవల ఈ నటుడు స్పందించాడు.
ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో మాధవన్. అలాంటి మాధవన్ కొంతకాలంగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. దానికి కారణం 'రాకెట్రీ' అని మూవీ ప్రమోషన్స్ సమయంలో బయటపెట్టాడు ఈ హీరో. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని దగ్గర నుండి చూసి, ఆయన దగ్గర నుండి సమాచారం తీసుకొని రాకెట్రీని జాగ్రత్తగా తెరకెక్కించాడు మాధవన్.
రాకెట్రీలో మాధవన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం మాధవన్ తన ఇల్లు అమ్మేశాడని నిన్నటి నుండి వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాధవన్ ట్విటర్ ద్వారా స్పందించాడు. 'నా త్యాగాన్ని మరీ ఎక్కువ దేశభక్తిలాగా చూడకండి. నేను నా ఇంటిని పోగొట్టుకోలేదు. రాకెట్రీలో భాగమయిన వారందరూ గర్వంగా ఈ ఏడాది ఎక్కువ ఇన్‌కం ట్యాక్స్ కట్టుకుంటారు. ఎందుకంటే దేవుడి దయ వల్ల మేము చాలా లాభాలు పొందాము. నేను ఇంకా నా ఇంటిని ప్రేమిస్తూ.. అందులోనే జీవిస్తున్నాను.'
Oh Yaar. Pls don't over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com