Adipurush : సైఫ్ అలీ ఖాన్ లుక్‌పై వస్తున్న ట్రోల్స్‌ గురించి దర్శకుడు ఓం రౌత్ ఏమన్నారంటే..?

Adipurush : సైఫ్ అలీ ఖాన్ లుక్‌పై వస్తున్న ట్రోల్స్‌ గురించి దర్శకుడు ఓం రౌత్ ఏమన్నారంటే..?
Adipurush : ఆదిపురుష్‌లో సైఫ్ అలీఖాన్ లుక్‌పై వస్తున్న విమర్శలకు దర్శకుడు ఓంరౌత్ క్లారిటీ ఇచ్చారు

Adipurush : ఆదిపురుష్‌లో సైఫ్ అలీఖాన్ లుక్‌పై వస్తున్న విమర్శలకు దర్శకుడు ఓంరౌత్ క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ టీజర్‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ గెటప్ సరిగా లేదని బీజేపీ నాయకురాలు, నటి మాలవికా అవినాశ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సైఫ్ ఆదిపురుష్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీలా, ఉగ్రవాదిలా ఉన్నట్లు ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. రావణుడిగా పొడవాడి గడ్డం ఏమిటి, కంటి కింద సుర్మా ఏంటి అని కూడా కొందరు ప్రశ్నించారు.

వీటన్నిటికీ సమాధానంగా ఓంరౌత్ మాట్లాడుతూ... 'సైఫ్ అలీఖాన్ లుక్ నిజంగా డిఫరెంట్‌గా ఉండడం వాస్తవమే. రావణుడిని భయంకరంగా, గంభీరంగా గతంలో చూపించారు. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా మేము చూపించడానికి ప్రయత్నించాము. రావణుడిది పుష్పక విమానం.. కానీ తాము ఇందులో పెద్ద గబ్బిలమే ఆయన వాహనంగా ప్రెజెంట్ చేశాము. హనుమంతుడికి లెదర్ దుస్తులు వేశామన్నారు. కానీ అందులో నిజం లేదు. మేము ఎక్కడా లెదర్ వస్తువులను వాడలేదు. కేవలం 95 సెకన్ల వీడియోను చూసి ఓ అభిప్రాయానిక రాకూడదు. సినిమా చూసిన తరువాత మాట్లాడండి' అని ఓం రౌత సమాధానం ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story