16 Aug 2022 11:00 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Aditi Shankar: 'ఆ...

Aditi Shankar: 'ఆ హీరోతో నటించకూడదు'.. కూతురిపై డైరెక్టర్ శంకర్ ఆంక్షలు..

Aditi Shankar: అదితి శంకర్ హీరోయిన్ అవ్వాలని ఎప్పటినుండో కలలు కనడం మొదలుపెట్టింది.

Aditi Shankar: ఆ హీరోతో నటించకూడదు.. కూతురిపై డైరెక్టర్ శంకర్ ఆంక్షలు..
X

Aditi Shankar: సినీ పరిశ్రమలో వారసత్వం అనేది కామన్. దర్శక నిర్మాతలు, నటీనటులు.. ఇలా చాలామంది తమ వారసులను హీరోలుగా, హీరోయిన్లుగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆశపడతారు. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది మాత్రం వారి వారసులను సినీ పరిశ్రమ అనే ఊబిలో పడకుండా ఉండాలని కోరుకుంటారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూడా అలాగే అనుకున్నారు. కానీ తన కూతురు అదితి వినలేదు.

అదితి శంకర్ హీరోయిన్ అవ్వాలని ఎప్పటినుండో కలలు కనడం మొదలుపెట్టింది. కానీ ముందు చదువు పూర్తి కావాలని కష్టపడి ఎంబీబీఎస్ చేసింది. ఆ తర్వాత తాను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని తండ్రికి చెప్పింది. కానీ దీనికి శంకర్ సమ్మతించలేదట. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డాక్టర్‌గా వృత్తిని కొనసాగిస్తానని తండ్రికి మాటిచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అదితి. కానీ అదే సమయంలో శంకర్.. అదితికి ఓ కండీషన్ పెట్టాడట. అదితి శంకర్.. కార్తీ నటించిన 'విరుమాన్‌' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

విరుమాన్ చిత్రం విడుదల కాకముందే శింబుతో కలిసి 'కరోనా కుమార్' అనే సినిమాలో అదితికి అవకాశం వచ్చింది. కాకపోతే ఆ హీరోతో అస్సలు నటించవద్దని అదితికి ఆంక్షలు పెట్టాడట శంకర్. దీనికి కారణం శింబుకు కోలీవుడ్‌లో ఉన్న లవర్ బాయ్ ఇమేజే. ఇప్పటికే ఎంతోమంది కోలీవుడ్ హీరోయిన్స్‌తో శింబు ప్రేమ, బ్రేకప్ వ్యవహారాలు నడిచాయన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే శంకర్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో కరోనా కుమార్ చిత్రం కూడా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

Next Story