Disha Patani: కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయిన హాట్ బ్యూటీలు..
Disha Patani: ఒక భాషలో నటిగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమ ప్రతిభ ఏంటో ఇతర భాషలో కూడా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు హీరోయిన్స్. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలనుకుంటారు. తాజాగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు హాట్ బ్యూటీల కన్ను కోలీవుడ్‌పై పడింది. వారెవరో కాదు శ్రద్ధా దాస్, దిశా పటానీ.
శ్రద్ధా దాస్.. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో చేసేంది. కెరీర్ స్లో అయ్యాక సెకండ్ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా ఒప్పుకుంది. పలువురు స్టార్ల సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరిసింది. కానీ తనకు ఎప్పటికప్పుడు అదృష్టం కలిసి రాలేదు. అందుకే తాజాగా 'అర్థం' అనే చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది శ్రద్ధా దాస్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుండగా.. తమిళంలో ఇదే తన మొదటి చిత్రం.
తెలుగులో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చి.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది దిశా పటానీ. కానీ గతకొంతకాలంగా తను సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు. అయినా కూడా ఓ కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ తనను వెతుక్కుంటూ వచ్చింది. శివ డైరెక్షన్‌లో స్టార్ హీరో సూర్య ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో దిశా పటానీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. ఇక దిశా కెరీర్ ఈ సినిమాతో అయినా మలుపు తిరుగుతుందేమో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com