Hema Malini : భర్త నుంచి దూరంగా ఉండటంపై స్పందించిన డ్రీమ్ గర్ల్
అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలినికి, ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆ జంట కలిసి ప్రేమను పంచుకోవడమే గానీ అసంతృప్తిని బయట పెట్టిందే లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో హేమ నా మనసులో మాట చెప్పారు. భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హేమ తన మనసులో మాట చెప్పారు. ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరనీ.. కానీ జీవితం ఏదిస్తుందో అది తీసుకోక తప్పదనీ అన్నారు. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరిక ఉంటుందని, కానీ ఎక్కడో ఈక్వషన్స్ మారిపోతాయి అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
అలా అని తానేమి బాధలో లేనని, ఇద్దరు పిల్లలతో తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతోంది అన్నారు.అంతే కాదు పిల్లల వివాహ విషయంలో కూడా ధర్మేంద్ర చాలా టెన్షన్ గా ఉండేవారని, తను మాత్రం వారి వివాహం చక్కగా జరుగుతుంది అనే ధైర్యం చెప్పేదానిని అన్నారు. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో పిల్లల పెళ్లిల్లు అయిపోయాయని, తాము ఇద్దరు అనుకున్నది ప్రతిదీ జరిగిందన్నారు.
1970లలో ధర్మేంద్ర, హేమమాలిని జోడీ జనాన్ని చాలా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే పుకార్లు షికారు చేసాయి. తరువాత వాటిని ధర్మేంద్ర నిజం చేయాలనుకోగా,అతనిలోని ప్రేమను గుర్తించిన హేమామాలిని, వయసులో తనకంటే 13 ఏళ్ళు పెద్దవాడయిన ధర్మేంద్రకు ఓకే చెప్పారు. అప్పటికే ధర్మేంద్రకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1980లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు కానీ ఇప్పటికీ ధర్మేంద్ర తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. దీంతో
తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమవేరే ఇంట్లో ఉంటున్నారు. ఈ 43 ఏళ్ళలో ఇప్పటికి ఏ ఇంటర్వ్యూ లోనూ హేమ ఈ విషయాలు బయటకు చెప్పలేదు. తన భర్త తనకు కావలసిన అంత ప్రేమను పంచుతున్నాడు కాబట్టి మిగతా విషయాలన్నీ తనకు అనవసరం అన్నట్టుగానే నవ్వుతూ ముగించేవారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com