Entertainment: నా బుజ్జి టొమాటో.....

Entertainment: నా బుజ్జి టొమాటో.....
X
ముద్దుపేర్లతో మురిపిస్తున్న కొత్త లవర్స్; మిల్కీ బ్యూటీకి మరో పేరు పెట్టిన విజయ్ వర్మ...

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్న ముచ్చట అందరికీ తెలిసిందే. ఇతర సెలబ్రిటీ జోడీల మాదిరి తమ బంధాన్ని గోప్యంగా ఉంచకుండా చక్కగా చట్టాపట్టాలేస్తోన్న ఈ జంటను చూసి ఇటు టాలీవుడ్ జనాలు, అటు బాలీవుడ్ వాసులు కూడా తెగ మురిసిపోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు ప్రసంశించుకుంటూ అబ్బా అనుబంధం అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ ముద్దు పేర్లుతో పిలుచుకోవడం చూసి నెటిజెన్లు ఫిదా అయిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ వర్మ బెర్లినాల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యాడు. అక్కడ దాహద్ అనే సినిమా స్క్రీనింగ్ అవుతుండటంతో టీమ్ తో సహా అక్కడికి వెళ్లాడు. ఇక బాయ్ ఫ్రెండ్ ను బాగా మిస్ అవుతోన్న తమన్నా ఆ సినిమా టీమ్ ఫొటోను షేర్ చేసి ఆల్ ది బెస్ట్ దాహద్ టీమ్ అంటూ కామెంట్ చేసింది. దీనికి విజయ్ కూడా ఓ చక్కని రిప్లై ఇచ్చాడు. థాంక్యూ టమాటర్ అంటూ తనదైన శైలిలో స్పందించాడు. దీంతో విజయ్ తమన్నాను ముద్దుగా టమాటో అని పిలుచుకుంటన్నాడని నెటిజెన్లు ఒక్కటే ఇదైపోతున్నారట. దీంతో పాటే కామెంట్ల వెల్లవతో ఈ జంటపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. ఏమైనా... మిల్కీ బ్యూటీ కొత్త పేరు భలే ముద్దుగా ఉందని ఒప్పుకోవాల్సిందే....

Tags

Next Story