Gladiator Sequel: ప్రపంచం మెచ్చిన గ్లాడియేటర్ కు సీక్వెల్ రాబోతోందట...

Gladiator Sequel:  ప్రపంచం మెచ్చిన గ్లాడియేటర్ కు సీక్వెల్ రాబోతోందట...
గ్లాడియేటర్ సీక్వెల్ అనౌన్స్మెంట్

గ్లాడియేటర్ ఇప్పటికీ ఎంతో మందికి హాట్ ఫేవరెట్ అయిన సినిమా. గ్లాడియేటర్ సినిమా కాదు ఓ ఎమోషన్ అనే సినీ ప్రియులకు కొదవే లేదు. 2000లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. ఏకంగా 12 ఆస్కార్ నామినేషన్లు సంపాదించుకున్న చిత్రంగానూ నిలిచింది. అందులో 5 అవార్డులను గెలుచుకుంది కూడా. అయితే తాజాగా ఈ చిత్రాని సీక్వెల్ ను రూపొందించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిడ్లే స్కాట్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల శరవేగంగా జరుగుతుండగా, 2024 నవంబర్ 22న గ్లాడియేటర్ సీక్వెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story