Golden Globe: RRR బృందానికి ఆలియా దావత్...!

ఆర్‌ఆర్‌ఆర్ లోని 'నాటు నాటు...'సాంగ్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీనటులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటుంటే, మరికొందరు ఈ అవార్డు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు సినీపరిశ్రమ చరిత్రను తిరగరాసింది. ఇక తమదైన శైలిలో కొందరు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందానికి అభినందలు, గిఫ్ట్‌లు ఇస్తుంటే, ఈ మూవీలో నటించిన అలియాభట్ మాత్రం ఓ గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్(RRR)తోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలియా తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీకి 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పై అలియాభట్, తన భర్త రణబీర్ కపూర్ ఇరువురూ రాజమౌళికి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా పర్స్‌నల్ గా కూడా తమ అభినందనలు తెలియజేశారట.
ఇంతటితో ఆగకుండా RRRటీమ్ మొత్తానికి అలియా బిగ్ పార్టీ ప్లాన్ చేయనుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పార్టీ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసిన అనంతరం రాజమౌళితో పాటు టీమ్ మొత్తానికి ఆహ్వానించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com