Hansika Motwani: పెళ్లికి హన్సిక గ్రీన్ సిగ్నల్.. పొలిటీషియన్ కుమారుడితో..

Hansika Motwani: ఇప్పటికే మూడు పదులు దాటిన నటీమణులు ఎందరో తమ పెళ్లి వార్త చెప్పి అభిమానులను ఖుషీ చేస్తు్న్నారు. కానీ మరికొందరు హీరోయిన్లు మాత్రం కెరీర్ కోసం పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఇక చేతినిండా అవకాశాలు లేకపోవడం వల్ల కూడా హీరోయిన్లు పెళ్లిబాట పడుతున్నారు. తాజాగా బబ్లీ బ్యూటీ హన్సిక కూడా పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త వైరల్‌గా మారింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక.. టాలీవుడ్‌లో అడుగుపెట్టి హీరోయిన్‌గా మారింది. ఇక కెరీర్ మొదట్లోనే పలువురు స్టార్ హీరోలతో జోడీకట్టింది. మెల్లగా బరువు పెరగడం మొదలయినా కూడా హన్సికకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. బబ్లీ బ్యూటీగా తన హవా కొనసాగించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కోలీవుడ్ బాటపట్టింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం హన్సిక చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి. ఓ ప్రముఖ పొలిటీషియన్ కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి హన్సిక సిద్ధమయ్యిందట. అంతే కాకుండా ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇక హన్సికనే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచిచూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com