13 July 2022 1:00 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Hansika Motwani:...

Hansika Motwani: పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు హన్సిక ఆసక్తికర జవాబు..

Hansika Motwani: హన్సిక 50వ చిత్రం ‘మహా’ త్వరలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Hansika Motwani: పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు హన్సిక ఆసక్తికర జవాబు..
X

Hansika Motwani: సినీ పరిశ్రమలో బ్యాచిలర్స్‌గా ఉంటున్న హీరోహీరోయిన్ల పెళ్లి గురించి నిరంతరం ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారు ఏ సందర్భంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దానిపై నటీనటులు స్పందించే తీరు కూడా ఫన్నీగా ఉంటుంది. తాజాగా దేశముదురు బ్యూటీ హన్సిక కూడా తన పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయినా కూడా హీరోయిగా తెలుగులో డెబ్యూ చేసిన నటి హన్సిక. కేవలం సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది ఈ భామ. కానీ గతకొంతకాలంగా సినిమాల విషయంలో హన్సిక స్లో అయ్యింది. దానికి కోవిడ్ కూడా ఓ కారణమంటోంది. ఇక తాజాగా హన్సిక.. తన 50వ చిత్రంతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది.

హన్సిక 50వ చిత్రం 'మహా' త్వరలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ చెన్నైలో ఓ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో హన్సికకు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, వర్క్‌తోనే తన పెళ్లి అని చెప్పుకొచ్చింది. ఇక టైమ్ వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది హన్సిక.

Next Story