రిటైర్మెంటా...!! నో ఛాన్స్ : హారిసన్ ఫోర్డ్

దిగ్గజ హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ యాక్టింగ్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. నటనకు వయసుతో సంబంధం లేదని తెలిపాడు. హాలీవుడ్ నుంచి ఇక రిటైర్ అవుతారా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా... తాను రిటైర్ కావడానికి సిద్ధంగా లేనని 81 ఏళ్ల ఫోర్డ్ స్పష్టం చేశాడు. తాను పని చేయడానికి కష్ట పడతానని... నటించడం తనకు చాలా ఇష్టమని యాక్టింగ్‌పై తనకు ఉన్న వల్లమానిన ప్రేమను బయటపెట్టాడు. ఓ సన్నివేశంలో నటించేటప్పుడు ఏం చేయాలనుకుంటున్నానో ప్లాన్ చేయనని తన యాక్టింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. తాను చేసి పనుల వల్ల సహజం తీవ్రంగా ప్రభావితమవుతుందని తాను అనుకుంటున్నానని ఫోర్డ్ తెలిపాడు. తన వయస్సును దాచడానికి ఏమీ లేదని.. అది అందరికీ తెలిసిందేనని సరదగా వ్యాఖ్యానించాడు. తన కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో నటించేందుకు ఎలాంటి ఉత్సాహం చూపానో... ఇప్పుడు అలాగే చూపుతున్నానని ఫోర్డ్ అన్నాడు. నేను మళ్ళీ యవ్వనంగా మారలేనని... కానీ ఇప్పుడు వృద్ధాప్యాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నారు. హారిసన్ ఫోర్డ్ విలక్షణమైన అమెరికన్ నటుడు. అమెరికన్ గ్రాఫిటీ, ది కాన్వర్సేషన్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన తరువాత స్టార్ వార్స్‌లో హాన్ సోలో పాత్రతో ప్రపంచఖ్యాతిని పొందాడు. 1985 లో డిటెక్టివ్ పాత్రకు అకాడమీ అవార్డును అందుకున్నాడు.నటనకు వయసుతో సంబంధమా: హారిసన్ ఫోర్డ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com