Natasha Doshi : సీక్రెట్ గా హీరోయిన్ పెళ్లి.. నెల తర్వాత ఫొటోలు వైరల్

Natasha Doshi : సీక్రెట్ గా హీరోయిన్ పెళ్లి.. నెల తర్వాత ఫొటోలు వైరల్

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని సీజన్లలో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. హీరోయిన్లు, హీరోలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు. ఇక గతేడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ యాక్టర్ జాకీ బగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది. అలాగే టాలీవుడ్ హీరో అర్జున్ పెద్దకూతురు ఐశ్వర్య కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అక్షరాపార్ధశాన్ని ఇటీవలే తాజాగా వివాహం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొడుకు హీరో ఆశిష్‌ కూడా ఇటీవల పెళ్లికి బాజా మోగించాడు. రెండు రోజుల క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకొంది. తంవరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది.

ఈ లిస్ట్ లోనే మరో హీరోయిన్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. బాంబే బ్యూటీ హీరోయిన్ నటాషా దోషి (Natasha Doshi) వెడ్డింగ్ బెల్స్ కొట్టేసింది. బాలయ్య నటించిన జై సింహా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ నటించిన కోతలరాముడు, కళ్యాణ్‌రామ్ నటించిన ఎంతమంచివాడవురా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ గతేడాది బిజినెస్ మ్యాన్. మనోజ్ షా తో ఎంగేజ్ మెంట్ తో వార్తల్లోకి వచ్చింది. జనవరి 31న వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మ్యాటర్ లేట్ గా బయటకు వచ్చింది. లేటెస్ట్ గా ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ తోనే విష్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story