Hollywood: ఎవెంజర్స్ హీరోకి ప్రమాదం.. క్రిటికల్‌ అంటున్న వైద్యులు

Hollywood: ఎవెంజర్స్ హీరోకి ప్రమాదం.. క్రిటికల్‌ అంటున్న వైద్యులు
X
మంచు తుఫానులో గాయపడ్డ హాలీవుడ్‌ నటుడు జెరెమీ రెన్నర్; పరిస్థితి విషమం అంటున్న వైద్యులు

ప్రస్తుతం అమెరికాను మంచు తుఫాను ముంచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారీ ఎత్తున్న మంచు కురవడంతో, రహదారులు సైతం కనిపించని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తూ ఓ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జెరెమీ రెన్నర్‌ గాయాలపాలయ్యాడు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.

కాలిఫోర్నియాలో నివాసముంటోన్న 51 ఏళ్ల జెరెమీ ఆదివారం తన ఇంటి దగ్గర మంచు తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అదుపు తప్పి గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన రెన్నర్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఇక అత్యవసర చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా కుడి మోచేయి, ఎడమ మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

'ది హర్ట్ లాకర్' కోసం 2010లో ఉత్తమ నటుడి ఆస్కార్ నామినేషన్ కూడా అందుకున్నాడు రెన్నర్‌. 'మేయర్ ఆఫ్ కింగ్‌స్టౌన్‌' లో కూడా కనిపించాడు. ఇక జెరెమీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story