Indian Idol: ఇండియన్ ఐడల్ సీజన్-2
త్వరలోనే ఆడిషన్స్... బృందం కీలక ప్రకటన...

'ఆహా' ఒటీటీలో ప్రసారమై సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం సీజన్-2తో మరోమారు మన ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోని మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీసి ప్రేక్షకులకు ఎంతో వినోదాన్నిపంచే ఈ ప్రోగ్రాం కోసం అటు సంగీత ప్రియులు, ఇటు పోటీదారులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతేడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం మళ్లీ డబుల్ డోస్‌తో అలరించేందుకు సిద్ధమౌతోంది. ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ కూడా త్వరలోనే జరుగుతాయని తెలుస్తోంది. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు సిద్ధంగా ఉండాలని తెలుగు ఇండియన్ ఐడల్ బృందం చెబుతోంది. మరి ఈసారి ఇండియల్ ఐడల్ ఎవరిని వరిస్తుందో చూడాలి.
Next Story