Indian Idol Telugu: జై జవాన్....

Indian Idol Telugu: జై జవాన్....
X
ఇండియన్ ఐడల్ వేదికపై మెరిసిన బీఎస్ఎఫ్ జవాన్; పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన న్యాయనిర్ణేతలు

భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రాణాలు లెక్కచేయకుండా దేశానికి పహారాకాసే సైనికుడు సంగీతంపై మక్కువతో మైక్ పట్టాడు. ఇండయన్ ఐడల్ లో న్యాయనిర్ణేతలను మెప్పించాడు. ఈ అపూర్వ ఘటన తెలుగు ఇండియన్ ఐడల్ లో చేటుచేసుకోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికపై ప్రసారం అవుతోన్న ఇండియన్ ఐడల్ తెలుగుకు ఈ విశిష్ఠమైన కంటెస్టెంట్ విచ్చేశారు. బీఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న చక్రపాణి దేశం పట్ల తనకున్న బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సంగీతం పట్ల ఆయనకున్న ఇష్టానికి సాధన రూపంలో మెరుగులు దిద్దారు. సంగీతంలో ఏ విధమైన తర్ఫీదు పొందనప్పటికీ అద్భుతమైన గాత్రంతో న్యాయనిర్ణేతలను ముగ్ధులను చేశారు. సరిహద్దుల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మొబైల్ నెట్వర్క్ కూడా దొరకని ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే తనకు పాటలే తనకు అండగా నిలిచాయని చక్రపాణి పేర్కొన్నారు. సహజంగా ప్రతి కంటెంస్టెంట్ నూ క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని జడ్జ్ కార్తిక్, చక్రపాణి పాట పూర్తిచేయకముందే అతడికి ఓటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చక్రపాణి ఈ అవకాశాన్ని నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు తనకు సెలవులు దొరకవని, దేశ సేవకు తాను వెళ్లే సమయం ఆసన్నమైందని వెల్లడించారు. దేశసేవ పట్ల చక్రపాణి అకుంటిత దీక్షతకు ఫిదా అయిపోయిన జడ్జిలు నిలబడి ఆయనకు సెల్యూట్ చేశారు. ఇండియన్ ఐడల్ వేదిక జవాన్ రాకతో పునీతమైందని తమన్ వ్యాఖ్యానించారు. ఈ క్షణం తమకు ఎంతో గర్వకారణమని కార్తిక్ కొనియాడారు. అయితే చక్రపాణి తదుపరి ఎపిసోడ్ లలో పాలుపంచుకునే విధంగా ఏమైనా అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ఆయన ఉన్నతాధికారులను సంప్రదిస్తానని తమన్ మాటిచ్చారు. ఏమైనా ఈ ఎపిసోడ్ కు అన్ని వర్గాల వారి నుంచి ఆదరణ లభిస్తోంది.

Tags

Next Story